ఇది 2008 సెప్టెంబర్ నాలుగవ తారీకు, నేను మద్రాస్ యూనివర్సిటీ లో డిగ్రీ చదువుతున్న రోజులు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ అంటే అదొక వింత ప్రపంచం. నాకు ఎంతో ప్రియమైన మిత్రుడు ఉండేవాడు వాడి పేరు శేఖర్. ఒక రోజు నేను వాడి ఇంటికి వెళ్ళాను ఎదో ప్రాజెక్ట్ వర్కు పని మీద. నేను వాళ్ళ డోర్ దగరికి వెళ్లి శేఖర్ శేఖర్.. అని అరిచాను, అపుడు వాళ్ళ అమ్మ గారు డోర్ తీశారు. పల్లెటూరి నుంచి వచ్చిన నాకు డోర్ కి బెల్ ఉంటుంది అని అది టచ్ చేస్తే అవతల వాళ్లకి వినిపిస్తుంది అని తెలీదు, అది గమనించిన శేఖర్ వాళ్ళ అమ్మ గారు నన్ను రా బాబు లోపలకి అని హాల్ లో కూర్చోపెట్టారు. 
  
శేఖర్ వాళ్ళ ఇల్లు చూడటానికి చాలా చిన్నగా కానీ అందంగా ఉంది. ఒక పది నిమిషాలకి ఆంటీ వచ్చి నాకు కాఫీ ఇచ్చారు. సోఫా చిన్నగా ఉండటం కారణంగా నా పక్కనే కూర్చున్నారు. శేఖర్ అపుడే గ్రౌండ్ నుంచి వచ్చి, ఒక అరగంట లో స్నానం చేసి వస్తాను, కాస్త వెయిట్ చేయు అనడు. నేను సరే అని కూర్చున్నాను. ఆంటీ నా వివరాలు అన్ని అడగసాగారు,నేను కూడా వాళ్ళ వివరాలు అడగడం మొదలుపెట్టాను. మూడేళ్ళ క్రితమే అంకుల్ గారు కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారని ఆంటీ ద్వారా తెలిసింది. 
  
ఆంటీ అయితే ఆలా లేరు, చాల అందంగా యవ్వనంగా ఉన్నారు. నేను ఒకటి గమనించాను, ఆంటీ నాతో మాట్లాడుతుండగా మధ్య మధ్యలో ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, నేను అడిగాను ఏంటి ఆంటీ అని ఆమే, సూర్య ఇది సెల్ ఫోన్ అంటారు, ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఉన్న వారితోనైనా మాట్లాడుకోవచ్చు అన్నారు. నేను చాల ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఆశ్చర్యం ఆ రోజు చాలానే జరిగాయి లేండి. ఇంతలో శేఖర్ వచ్చాడు మేము క్లాస్ కి వెళ్ళిపోయాము. 

శేఖర్ - ఇంటర్నెట్ కి బానిస అవ్వడం. 
అవి సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడ్తున్న రోజులు. నేను నా రోజంతా లైబ్రరీ లోనే గడిపేవాడిని. కొన్ని రోజులుగా శేఖర్ కాలేజీ లో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ లోనే ఉండటం గమనించా. తర్వాత అడుగుదాం అని నేను నా ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నాక వెళ్లి శేఖర్ ని అడగసాగాను. శేఖర్ ఎవరో అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు చెప్పాడు. తనతో గంటలకొద్దీ చాటింగ్ చేస్తునట్టు చెప్పాడు. నాకు మొదట్లో సంతోషంగా ఉన్న కొన్ని నెలలకి శేఖర్ కాలేజీ కి కూడా రావడం మానేసాడు. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ బట్టలు ఇస్త్రీ చేసేయ్ చాకలి గారు ఏమన్నారు అంటే శేఖర్ వాళ్ళ అమ్మ గారు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని. ఒక్క క్షణం నా మనసు విరిగిపోయినట్టు అనిపించింది. నాకంట్లోంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. అంత ఆనందంగా ఉన్నారు అనుకున్న సమయానికి ఇలా అవ్వడం చాలా చాలా బాధని ఇచ్చింది. 

అసలు ఎందుకు చనిపోయారు? 
పైకి బాధ ఉన్న లోపల ఎక్కడో ఒక సందేహం, ఎందువల్ల చనిపోయి ఉంటారు. ఇంత ప్రణమిత్రుడైన నాకు ఎందుకు చెప్పకుండా చనిపోయి ఉంటాడు. చనిపోవాల్సిన బాధ ఆంటీ కి ఏమొచ్చింది? ఈ ప్రసనలన్నిటిని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడిగాను. అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ గారు పిలిచి చెప్పారు వివరంగా. నీ మిత్రుడు అయినా శేఖర్ గత కొన్ని నెలలుగా చాట్టింగ్స్ చేస్తూ ఉన్నాడు. ఆ చాట్టింగ్లో చాలా సార్లు ఒకరికొకరు బట్టలు లేని ఫోటోలు పంపుకున్నారు, ప్రేమ సందేశాలు పంపుకున్నారు. అది సెప్టెంబరు రెండవ తారీకు ఆ రోజు వాళ్ళ ఇద్దరు కలుసుకుందాం అని పార్కు కి వెళ్లారు, అపుడు వరకు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కారణంగా, బట్టలు రంగుని పట్టి పోల్చుకున్నారు. శేఖర్ ఒక్కసారిగా బిత్తరు పోయాడు. ఆమే కూడా ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు. శేఖర్ ఇన్నాళ్లు తన ప్రేమ సందేశాలు అన్ని వాళ్ళ అమ్మ కే ఇచ్చాడని తెలుసుకున్నాడు. 

ఇంటర్నెట్ - ఆత్మహత్య 
ఇద్దరు క్షమించరాని తప్పు చేసారని మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఇలా క్షణికావేశంలో మనకి తెలీకుండానే ఈ ఇంటర్నెట్ జాలి లో పడి, ప్రాణాలు కూడా కోల్పోయే స్థాయికి వస్తున్నాము. ఇంటర్నెట్ ని వాడుకుందాం, అది మనల్ని వాడుకునేలా చేసుకోవద్దు.