* ఈ చిట్కా కి కావలసిన పదార్థాలు,దాని తయారీ విధానం,వాడే పద్దతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:-
1.కర్బూజ పండు గుజ్జు - 1 చెంచా.
2. నెయ్యి. - 1 చెంచా.
3. ఎండు ద్రాక్ష పళ్ళు గుజ్జు - 1 1/2 చెంచా.
4.పంచదార. - 1 చెంచా.
5.తేనె - 1 చెంచా.
6. పిప్పళ్లు చూర్ణం - 1 చెంచా.
తయారీ విధానం:-
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న కర్బూజా గుజ్జు,నెయ్యి,ఎండు ద్రాక్ష గుజ్జు,పంచదార,తేనె, పిప్పళ్లు చూర్ణం,వేసి బాగా కలుపుకోవాలి.
* అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి భద్రపరచుకోవాలి.
* ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా, ఒక గ్లాసు పాలలో వేసి ,రోజూ ఉదయం, సాయంత్రం బలహీనంగా ఉన్న పిల్లలకి తాగించాలి.
* ఇలా తరచూ చేయడం వల్ల మీ పిల్లలు దృఢంగా ఆరోగ్యవంతంగా తయారు అవుతారు.
0 Comments