*కంటి క్రింద వలయాలు(నలుపులు)తగ్గి మీ కళ్ళు అందంగా,ఆకర్షణీయంగా కనిపించడానికి ఒక దివ్య ఔషదం:-

   * మనిషి శరరంలో ప్రాముఖ్యమైనది కళ్ళు. ప్రస్తుత  కాలంలో చాల వరకూ మనం కంప్యూటర్లు,ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం.
దాని వల్ల మన కంటిచుట్టూ నలుపుగా మారీ. మన కళ్ళు చూడటానికి  అంద వికారంగా కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవారు చాల మంది ఉన్నారు.
  అలాంటి వారి కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనపడటానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
   * ఇంక ఆలస్యం చేయకుండా ఈ ఔషధాన్ని ఎలా తయారు చేయాలో, దానికి కావల్సిన పదార్థాలు,వాడే పద్దతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
   కావలసిన పదార్థాలు:-
 1. బాధం గింజలు పేస్టు - 1 చెంచా.
 2. పాల మీగడ.    - 1 చెంచా.
 3. నిమ్మరసం.       -    1/2 చెంచా.
 4.ముల్తానీ మట్టి.  -1/2 చెంచా.
 5.బంగళా దుంపల గుజ్జు - 1/2 చెంచా.
 6. వేడి పాలు.   - 1/2 చెంచా.
    తయారీ విధానం:-
  * ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న బాదం గింజల పేస్టు,పాల మీగడ,నిమ్మరసం, ముల్తానీ మట్టి,బంగాళదుంప గుజ్జు, వేడి పాలు,ఇవి మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి.
     * ఇలా కలిపిన మిశ్రమాన్ని కంటి చుట్టూ పూసుకోవాలీ (రాయాలి).అలా రాసుకుని అరగంట పాటు ఆరనివ్వాలి.
     * తరువాత వేడి పాలలో  దూది ముంచి కంటి చుట్టూ తుడవాలి (క్లీన్ చేసుకోవాలి) . తరువాత బంగళా దుంపను చక్రలుగా కోసుకుని, కంటిపై ఒక పది నిమిషాలు పాటు పెట్టుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చెయ్యాలి.
       * ఇలా చేయడం వల్ల మీ కంటి కింద నల్లటి వలయాలు పోయి , అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.