ఈ మాత్రలు ఒక్కసారి తయారు చేసుకుంటే 100 రోజుల వరకూ పనిచేస్తాయి.
వాయులాకు మత్రాలకు కావలసిన పదార్థాలు,దాన్ని తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
    కావాల్సిన పదార్థాలు:-
  1.వాయుకాకు - 50గ్రా"లు
  2.తులసి ఆకు - 50 గ్రా"లు
  3.తిప్పతీగ.     - 50గ్రా"లు
  4.వెల్లులి         - 50గ్రా"లు
  5.వామ్ము వేయించి దంచిన పొడి -50 గ్రా"లు
  6. మిరియాలు పొడి   -50 గ్రా"లు
  7.అల్లం రసం తగినంత.
 
తయారు చేయు విధానం:- 
 ముందుగా మనం తీసుకున్న వాయులాకూ,తులసి ఆకు,తిప్పతీగ, వేల్లులి ని బాగా మెత్తగా ముద్దలా రుబ్బుకోవాలి.అందులో వామ్ముని చెరిగి వేయించి దంచిన పొడిని,మిరియాల పొడిని వేసి బాగా కలపాలి.అలా కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ రోట్లో వేసి దానిలో సరిపడినంత అల్లం రసం వేసి బాగా రుబ్బి మెత్తని ముద్దలా చేసుకోవాలి.
అలా మెత్తగా ముద్దలా చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో వేసుకుని,చిన్న చిన్న ఉండలుగా, అంటే బఠానీ గింజ అంత  సైజ్ లో ఉండేలా చేసుకోవాలి.
అలా తయారు చేసుకున్న బఠానీ గింజంత సైజులో ఉన్న మాత్రలు ను ,ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టాలి.దానిలో ఉన్న తడి మొత్తం ఇంకిపోయేలా ఆరబెట్టూకోవలి. ( తడి ఉంటే బూజు పడుతుంది జాగ్రత్త)
ఉపయోగాలు:
1.ఏటువంటి జ్వరాలకైన పనిచేస్తుంది.
2.పక్షవాతం,ముఖ పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
3.కాళ్ళ నొప్పులు,ఒళ్ళు నొప్పులకు బాగా పనిచేస్తుంది.
వాడే విధానం:-
1.పిల్లలకి ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర వెయ్యాలి.
2.పెద్దలు మూడుపూటలా తీసుకోవాలి.